అసియాలోనే అద్వితీయం..! మెదక్ చర్చిని ఎవరు నిర్మించారో తెలుసా..?

అతి సుందర ఆధ్యాత్మిక కట్టడం.. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా పేరొందిన కళామయుడు...Special Story of Medak Charchi

Update: 2022-12-24 14:19 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: అతి సుందర ఆధ్యాత్మిక కట్టడం.. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా పేరొందిన కళామయుడు కోవెల... మానవత్వానికి.. మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచి మహోన్నత నిర్మాణం... ఈ అద్భుత నిర్మాణం ఎంతోమంది ఆకలి ఆకలి తీర్చింది.. అందుకేనేమో మతానికి కాకుండా ఈ చర్చి పర్యాటకంగా ప్రజల మనస్సుల్లో నిలుస్తోంది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన చర్చి మహాదేవాలయం అప్పుడే రెండు అడుగుల దూరంలో దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుంది.

నాడు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వెస్లీయన్ మెథడిస్ట్ వారు మెదక్ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో మత ప్రబోధకుడైన పాస్నెట్ మెదక్ పట్టణంలోని ఓ చిన్న చర్చిలో మత గురువుగా నియమితులయ్యారు. క్రీస్తు అంటే ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్న ఆయన మెదక్ ప్రాంతంలో మత ప్రచారంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత మిషన్ కాంపౌండ్ లోని చిన్న చర్చి సమీపంలో నిర్మించిన రెండంతస్తుల భవనంలోనే నివసించేవాడు. రోజు మాదిరిగానే ఓ సాయంత్రం భవనంపైకి ఎక్కి పై అంతస్తు పై భాగంలో నుంచి చర్చిని గమనించాడు. చర్చి కన్నా తాను నివసించే భవనం ఎత్తుగా ఉండడం సరికాదని భావించాడు. తప్పునుసరిదిద్దుకునే మార్గం గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఆలోచన మెదిలింది తన నివాస భవనం కన్నా చాలా పెద్దదైన చర్చిని నిర్మించడం ద్వారా పాప పరిహారం చేసుకోవాలని నిర్ణయించాడు. ఇంగ్లాండ్ లోని స్నేహితులకు తన ఆలోచన చెప్పాడు. వారు తమ వంతు సహకారాలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఏర్పడింది. దుర్భిక్షం నెలకొంది. పంటలు పండే పరిస్థితి లేక పనులు దొరక్క ప్రజలకు ఉపాధి కరువైంది. వేలాదిమంది ఆకలి దప్పులతో అల్లాడారు. ఈ నేపథ్యంలోనే పాస్నెట్... పనికి ఆహారం తరహాలో చర్చి నిర్మాణం పనులు చేపట్టారు. తద్వారా ప్రజలకు పని ఉపాధి చూపి ఆదుకున్నారు. ఈ విషయం తెలిసిన మెదక్ ప్రాంతవాసుల కాక పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు మెదక్ బాట పట్టారు. 1914లో మెదక్ చర్చి నిర్మాణ పనులు ప్రారంభమై 1924లో పూర్తయ్యాయి.



చర్చి నిర్మాణంలో ప్రత్యేకతలు...

చర్చి నిర్మాణంలో పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకము. అలాగే చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్లు తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్ లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మేలు ప్రతిగగా నిలుస్తున్నాయి. యేసుప్రభుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి భోజనం చేశారు. ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు చర్చిలో నిర్మించారు.


సూర్య కిరణాలు... సుందర దృశ్యాలు...

చర్చి మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్ కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బారి రూపొందించారు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనబడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు పడమరనపడే కాంతిపుంజలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి వేరువేరు సంవత్సరాల్లో అమర్చినట్లు చెబుతుంటారు.


తూర్పు కిటికీ యేసు జన్మ వృత్తాంతం...

యేసు పుట్టుకను తెలియజేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో యేసు ప్రభువు తల్లి మరియా, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు ఎడమవైపు గొల్లలు మధ్యలో గాబ్రియల్ లోక రక్షకులు కుడివైపు జ్ఞానులు ఉంటారు. పై భాగంలో యేసుకి ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్దమనిషి చిత్రాలు కనిపిస్తాయి. యేసు పుట్టుకకు 700 ఏళ్లకు క్రితమే యేసుప్రభు పుడతాడని యేషయా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయన గుర్తుగా ఈ కిటికీలో పెద్దమనిషిని పెట్టినట్లు ప్రతితీ.

యేసు సిలువ వృత్తాంతం పడమర కిటికీలో...

యేసు సిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందించిన ఈ కిటికీని 1958లో అమర్చారు. శిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చొని ఉన్న తల్లి మరియ, మీద చెయ్యి పట్టుకుని నిలబడి మద్ద లేని మరియా దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతోపాటు యేసు శిష్యుడు యేహన్ నిలబడి ఉంటాడు. యేసు తన శిష్యుడు యోహాన్ కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్ళకు కడతాయి. కుడివైపు బల్లెం పట్టుకుని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తాడు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వాక్యాలు ఉన్నాయి.

Tags:    

Similar News