ఎస్సై కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

ఎస్సై సాయికుమార్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ఆయన స్వగ్రామం మండల కేంద్రమైన కొల్చారంలో జరిగాయి.

Update: 2024-12-26 15:22 GMT

దిశ, కొల్చారం: ఎస్సై సాయికుమార్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ఆయన స్వగ్రామం మండల కేంద్రమైన కొల్చారంలో జరిగాయి. సాయి కుమార్ అంత్యక్రియల కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఎస్సై కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఎస్సై మృతదేహానికి నివాళులర్పించారు. మెదక్ జిల్లా పోలీసు సిబ్బంది తరపున ఎస్ఐ మహమ్మద్ గౌస్, సీఐ రాజశేఖర్ లు ఎస్సై సాయి కుమార్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయి కుమార్ బ్యాచ్కు చెందిన ఎస్సైలు ,కామారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున అంత్యక్రియలలో పాల్గొన్నారు.


Similar News