పతంగి కోసం వెళ్లి…కుంటలో మునిగి బాలుడు మృతి

పతంగి కోసం వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-12-26 13:35 GMT

దిశ, సిద్దిపేట అర్బన్ : పతంగి కోసం వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన అల్లెపు లింగం, పద్మల కుమారుడు తేజ్ కుమార్ (11) రోజు మాదిరి ఆడుకోవడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఈనెల 24న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా గురువారం కాలనీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్న క్రమంలో మత్సవాని కుంటలో అనుమానాస్పదంగా ఓ పతంగి కనబడింది. ఆ ప్రదేశంలో గజ ఈత గాళ్ల సహాయంతో వెతకగా బాలుడి మృతదేహం లభించింది. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Similar News