మెరిసే విప్లవధ్రువతార చాకలి ఐలమ్మ

చిట్యాల(చాకలి) ఐలమ్మ మెరిసే విప్లవ ధ్రువతార అని, దొరల పెత్తనాన్ని ఎదిరించిన ధీశాలి అని, ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-26 09:40 GMT

దిశ, కొండపాక : చిట్యాల(చాకలి) ఐలమ్మ మెరిసే విప్లవ ధ్రువతార అని, దొరల పెత్తనాన్ని ఎదిరించిన ధీశాలి అని, ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కుకునూర్ పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు.

    భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దేవి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్దుణ రవీందర్, పీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పోల్కంపల్లి నరేందర్, మాజీ సర్పంచ్ లు కాసం నవీన్ కుమార్, బోడపట్ల ఐలం శివ, కోల శ్రీనివాస్ ,పూలోజి కిరణ్, మాజీ ఎంపీటీసీ భూరమైన భూములు, వివిధ పార్టీల నాయకులు కందూరి అయిలయ్య, తూం శ్రీకాంత్ రెడ్డి, మల్లం ఐలయ్య, కొంతం కర్ణాకర్, చిన్నరాజుగాని మధు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News