పాతకక్షల నేపథ్యంలో... ఒక వ్యక్తిని హత్య చేసిన ఇద్దరు నిందితులు
గత రెండు సంవత్సరాల క్రితం తన తల్లి మృతికి కారణమైన వ్యక్తిఅని, అదే వ్యక్తి తన కుటుంబం విడిపోవడానికి కారణమయ్యాడని మరో వ్యక్తి ఇద్దరు కలిసి పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని హతమార్చరు.
దిశ, సదాశివపేట: గత రెండు సంవత్సరాల క్రితం తన తల్లి మృతికి కారణమైన వ్యక్తిఅని, అదే వ్యక్తి తన కుటుంబం విడిపోవడానికి కారణమయ్యాడని మరో వ్యక్తి ఇద్దరు కలిసి పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని హతమార్చరు. ఈ ఘటన సదాశివపేట లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. సిద్దపూర్ కాలనీ చెందిన అజయ్ రాజ్ అనే యువకుడు గత ఆదివారం రాత్రి అతి దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే మరణించిన వ్యక్తి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు పోలీసులు. దీంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. మృతుడికి వరుస తమ్ముడైన అజయ్ రాజ్ తల్లి గత రెండు సంవత్సరాల క్రితం చనిపోవడానికి కారణం అనిల్ రాజుని,అదే వ్యక్తి సదాశిపేట పట్టణం చెందిన రాజేష్ తన సంసారాన్ని మృతుడు అనిల్ రాజు కుటుంబ వలనే విడిపోయిందనే ద్వేషంతో ఇద్దరు కలిసి మృతుడు అనిల్ రాజును చంపాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి పేకాట ఆడదామని పథకం వేసి మృతుడు అనిల్ రాజ్ ను సిద్ధపూర్ కాలనీ లో ఉన్న రేకుల షెడ్డు లోకి తీసుకెళ్లారు. పేకాట ఆడాక ....చివరగా మృతుడు అనిల్ రాజును, అజయ్ రాజ్ తన వెంట తెచ్చుకున్న టువంటి పదునైన కత్తితో పొడిచి చంపారు. రాజేష్, అజయ్ రాజుకు సహాయ సహకారాలు అందించినట్లు కేసు నిర్ధారణ అయినట్లు సీఐ మహేష్ గౌడ్ వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన సదాశివ్ పేట పోలీస్ స్టేషన్ స్పెషల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎండి. జావిద్, అబ్జల్, కానిస్టేబుళ్లు బి. వెంకటేశం, హోంగార్డు వీరేశం, రమేష్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సంగారెడ్డి అభినందించారు. అరెస్టు చేసిన నేరస్థులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.