EE Sheikh Fasha : గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందిస్తేనే తగిన గుర్తింపు

గ్రామాలలో ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సహాయకులు స్వచ్ఛమైన నీరు అందించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, సహాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుందని సంగారెడ్డి జిల్లా మిషన్ భగీరథ (ఇన్ ఫ్రా) ఈఈ షేక్ ఫాషా అన్నారు.

Update: 2024-10-25 15:17 GMT

దిశ, ఆందోల్ : గ్రామాలలో ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సహాయకులు స్వచ్ఛమైన నీరు అందించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, సహాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుందని సంగారెడ్డి జిల్లా మిషన్ భగీరథ (ఇన్ ఫ్రా) ఈఈ షేక్ ఫాషా అన్నారు. జోగిపేట సబ్ డివిజన్ పరిధిలోని మిషన్ భగీరథ గ్రామాల మంచినీటి సహాయకులకు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. నీటి సరఫరా లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. మంచినీటి ట్యాంకుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. నాలుగు రోజుల పాటు వివిధ పనులపై శిక్షణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ జోగిపేట సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈ ఎం శేషగిరిరావు, జోగిపేట ఏఈ లక్ష్మీపార్వతి, ఏఈ లక్ష్మీ ప్రసాద్, గ్రామ మంచినీటి సహాయకులు పాల్గొన్నారు.


Similar News