స్వయం ఉపాధితోనే స్వావలంబన : ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

కుల వృత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017 లో గొర్రె కాపరుల స్వావలంబన నిమిత్తం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-26 12:01 GMT

దిశ, పెద్ద శంకరంపేట్: కుల వృత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2017 లో గొర్రె కాపరుల స్వావలంబన నిమిత్తం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి డోలుడప్పులతో సాంప్రదాయబద్ధంగా గొంగడిని కప్పి ఘన స్వాగతం పలికారు.

స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెండో ఫేజ్ లో గొర్రెల అభివృద్ధి పథకంలో గొర్రెల ప్రాథమిక సహకార సంఘం సభ్యులకు 20 అడ గొర్రెలకు ఒక మొగ గొర్రెను 75% శాతం సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గొల్ల, కురుమలు ఆర్థిక వివక్షకు గురయ్యారని తెలిపారు. గొల్ల కురుమల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనుందన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు విగ్రహం వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ వీణసుభాష్ గౌడ్, బోండ్ల దత్తు, ఎంపీడీవో రఫీకున్నీసా, జంగం రాఘవులు, పల్లెబోయిన పున్నయ్య, లక్ష్మణ్ నారాయణ, రామకృష్ణ గౌడ్, సలీం, బాయికాడి రామన్న, పొట్టి రజినీకాంత్, ఉప్పరి రాములు, మండల కురుమ సంఘం నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

Tags:    

Similar News