Collector : ప్రభుత్వ స్కూళ్ళు, సంక్షేమ పాఠశాలల్లో శానిటేషన్ చేయాలి
సెలవుల తర్వాత వసతి గృహాల్లో పాఠశాలల పునః ప్రారంభమవుతున్న తరుణంలో శానిటేషన్ పై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహు రాజ్ అధికారుల ఆదేశించారు.
దిశ, మెదక్ ప్రతినిధి : సెలవుల తర్వాత వసతి గృహాల్లో పాఠశాలల పునః ప్రారంభమవుతున్న తరుణంలో శానిటేషన్ పై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహు రాజ్ అధికారుల ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అభివృద్ధి సంక్షేమంపై పలు శాఖల అధికారులకు సూచన చేస్తూ.. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అందించేందుకు అధికారులు చొరవ చూపాలని, దసరా సెలవులు ముగించుకుని జిల్లాలో ప్రభుత్వ, సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఫ్రైడే డ్రైడే గా చేపట్టి పరిసరాల పరిశుభ్రత పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు మేరకు జిల్లాలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటులో భాగంగా అకాల వర్షాల వలన కూలిన పోయిన ఇండ్లకు, ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలను గుర్తించి రిజర్వేషన్ ప్రతిపాదికన వారికి మొదటి ప్రాధాన్యత గా ఇందిరమ్మ ఇళ్లు ప్రతి గ్రామ పంచాయతీ లో గ్రామ సభ పెట్టి అర్హత గల లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామ పంచాయతీ, మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ కమిటీల మార్గదర్శకాలను చదవాలని సూచించారు. ఇందిరమ్మ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు మూడు దశల్లో ఐదు లక్షలను ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.