మట్టి మాఫియా మాయాజాలం

పరిశ్రమల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల నుంచి మట్టి మాఫియా రాత్రి వేళల్లో భారీ వాహనాలతో మట్టిని తోడుతూ కొత్తగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Update: 2023-05-08 09:33 GMT

పరిశ్రమలకు కేటాయించిన స్థలాల నుంచి మట్టి అక్రమ రవాణా

పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు

దిశ, మనోహరాబాద్ : పరిశ్రమల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల నుంచి మట్టి మాఫియా రాత్రి వేళల్లో భారీ వాహనాలతో మట్టిని తోడుతూ కొత్తగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామ శివారులో దాదాపు 190 ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల నుంచి టీఎస్ఐఐసీ అధికారులు కొనుగోలు చేసి పలు పరిశ్రమలకు స్థలాలను కేటాయించారు.

ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది భూ యజమానులు నూతనంగా పరిశ్రమలను ఏర్పాటకు నిర్మాణాలను ప్రారంభించారు. దీంతో ఆ నిర్మాణాలకు భారీ ఎత్తున మట్టి అవసరమవుతుండటంతో ఏకంగా అక్కడే ఉన్న మరో పరిశ్రమకు కేటాయించిన స్థలాల నుంచి ఇసుకసురులు గత మూడు, నాలుగు రోజుల నుంచి రాత్రి వేళల్లో భారీ వాహనాలతో పెద్ద గోతులు తవ్వుతూ ఇతర పరిశ్రమలకు మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికైనా.. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి అక్రమ మట్టి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మైనింగ్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశాం..

అక్రమ మట్టి దందాపై ఇటీవలే మైనింగ్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామని ఐలా కొండాపూర్ కమిషనర్ వీరస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన కొంత మంది పరిశ్రమకులకు కేటాయించిన స్థలాల నుంచి అక్రమంగా మట్టిని తవ్వుతూ ఇతర పరిశ్రమలకు తరలిస్తున్నట్లు పేర్లతో సహా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు.  

Tags:    

Similar News