ప్రైవేట్ ఆసుపత్రుల్లో... వైద్య శాఖ అధికారుల తనిఖీలు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ వో డా. శ్రీనివాస్, డా. ఆనంద్, డా. శ్రీకళ,
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ వో డా. శ్రీనివాస్, డా. ఆనంద్, డా. శ్రీకళ, డా. అరుణ్ కుమార్ ల బృందం పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి ఆరోగ్య సేవలు నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నారా లేదా పరిశీలించారు. ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనుసరించి నిబంధనలు పాటించని నిరామయ, భజరంగ్ పాలీ క్లినిక్, మారుతి పాలీ క్లినిక్, గురు సాయి కంటి హాస్పిటల్ ను వైద్య అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ... ఆసుపత్రి పేరు మార్చినా.. డాక్టర్ మారినా అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ ఆసుపత్రులను నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపు హెచ్ ఐ ఎం ఎస్ పోర్ట్ లో అప్ డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.