‘రోడ్డు బాగు చేయండి .. సారు.. ఏండ్ల తరబడి ఇదే గోస పడుతున్నాం..’

అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది దౌల్తాబాద్ మండల

Update: 2024-07-02 13:41 GMT

దిశ,దౌల్తాబాద్: అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి. రోడ్డు మరమ్మత్తుల కోసం నిధులు విడుదలై సంవత్సరకాలం దగ్గర పడుతున్న ఒక్క రోడ్డు పని మొదలు పెట్టక పోవడం గమనార్హం. దీంతో గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వాన్నంగా తయారు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై సంవత్సరాలు గడుస్తున్నా రోడ్ల దుస్థితి ఏ మాత్రం మారడం లేదు. రోడ్ల మరమ్మతు, కొత్త రోడ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా వాస్తవంగా మాత్రం గ్రామీణ రోడ్లలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

మండలం పరిధిలో ని మొండి చింత నుండి నుండి మహమ్మద్ షాపూర్ మీదిగా బేగంపేట వరకు సుమారు 8 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా అధ్వానంగా తయారై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోందని వివిధ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైమద్ నగర్ నుండి బేగంపేట వరకు రోడ్డు గుంతలు బెంబేలెత్తిస్తున్నాయి. ముబారస్ పూర్ నుంచి కోనాపూర్ వరకు రోడ్డు మరమ్మాతులకు 92 లక్షలు మంజూరు కాగా పట్టించుకునే నాథుడే లేడు. తిర్మలాపూర్ నుండి గొడుగు పల్లి వరకు కోటి రూపాయలు నిధులు విడుదల అయ్యాయి. గొల్లపల్లి నుండి ఇందుప్రియల్ రోడ్డు కాకంకారా తెలి దారుణంగా మారింది.మండలం లో రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పాటి వర్షానికి బురదమయంగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దౌల్తాబాద్ మండల వైపు వెళ్లే రోడ్డు లో ఇందుప్రియల్, మహమ్మద్ షాపూర్ ,కోనాపూర్ , మీదుగా వెళ్లే రోడ్డు అద్వానంగా తయారైంది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. వర్షాలు కురవడంతో వాహనాలు వెళ్ళ లేక పోతున్నాయి. తరచూ ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని గ్రామస్తులు తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల అయినా పనులు మొదలు పెట్టక పోవడం పైన ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News