వాహనదారుల భద్రత పై ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం..

మద్దూరు మండలం వల్లంపట్ల కూటిగల్ గ్రామాల మధ్య రహదారి పై ప్రమాదకరంగా లోతైన గుంత ఏర్పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

Update: 2024-11-16 08:33 GMT

దిశ, మద్దూరు : మద్దూరు మండలం వల్లంపట్ల కూటిగల్ గ్రామాల మధ్య రహదారి పై ప్రమాదకరంగా లోతైన గుంత ఏర్పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మూలమలుపు వద్ద ప్రమాదకరంగా గుంత ఏర్పడిందని, గుంత వలన ప్రమాదాలకు గురై గాయాలపాలు అవుతున్నామని వాహనదారులు తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులు వాహనదారుల భద్రత పై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు కల్పించుకొని రోడ్డు పై ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చి వేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.


Similar News