ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీ

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. జి

Update: 2024-03-18 13:26 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. జిల్లా పరిధిలోని ములుగు, నారాయణ రావు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, మందులు అందుబాటులో ఉంచాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లకు సూచించారు. సమయ పాలన పాటించడంతో పాటుగా ఆరోగ్య కార్యక్రమాలు 100శాతం పూర్తయ్యేటట్లు ప్రణాళికలు రూపొందించుకొని నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ, గర్భిణీ స్త్రీల నమోదు, ఐఎఫ్‌ఏ టాబ్లెట్ల వినియోగం, బాలింతల గృహ సందర్శన, పోషకాహారం తదితర అంశాలపై వైద్యులతో చర్చించారు.


Similar News