మార్కెట్ యార్డ్ గోదాములను తనిఖీ చేసిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు..

నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తిరోడ్ లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఉన్న గోదాంను శనివారం హైదరాబాద్ కు చెందిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

Update: 2023-05-13 15:47 GMT

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తిరోడ్ లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఉన్న గోదాంను శనివారం హైదరాబాద్ కు చెందిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మార్కెట్ యార్డులో ఉన్న బియ్యం నిల్వలను హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ కు చెందిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు మల్లారెడ్డి, శ్రీనివాస్, రషీద్, రామచందర్, నరసింహారావు తదితరులు బియ్యాన్ని పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ నర్సాపూర్ మార్కెట్ యార్డ్ లోని గోదాములలో గత కొన్ని రోజుల నుండి బియ్యంతో పాటు లారీలు నిలిచిపోయిన విషయాన్ని గమనించి కమిషనర్ ఆదేశాల మేరకు బియ్యం పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. సివిల్ సప్లై సాంకేతిక నిపుణులు బృందం క్వాలిటీ మిషన్ మీద బియ్యం చెకింగ్ చేశారు. 

Tags:    

Similar News