మల్లికార్జున స్వామి కళ్యాణం,బ్రమ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
డిసెంబర్ 29న జరిగే మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం,జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి,
దిశ, కొమురవెల్లి : డిసెంబర్ 29న జరిగే మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం,జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. కళ్యాణం జరిగే తోట బావి, వీఐపీ దర్శనం, శీఘ్రదర్శనం,సాధారణ దర్శనం వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్, బస్టాండ్,ఎల్లమ్మ టెంపుల్, నూతనంగా నిర్మిస్తున్న 50 గదుల సత్రాన్ని నూతనంగా నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేర్యాల, హైదరాబాద్, కరీంనగర్ సిద్దిపేట, బస్సులు ఆటోలు వెళ్లే రూట్ లను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… స్వామివారి కళ్యాణం జరిగే తోటబావి వద్ద వీఐపీ దర్శనం, సాధారణ దర్శనం గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, భారీ గేట్లు తో పటిష్టంగా ఏర్పాటు చేయాలని, కళ్యాణం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫారంకు చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. ఫైర్ సేఫ్టీ గురించి షాప్ యజమానులకు అవగాహన కల్పించాలని, విఐపి పార్కింగ్ లో తగు ఏర్పట్లు చేయాలని భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం 24X7 కల్పించాలని ఆర్ డబ్ల్యూ అధికారులకు సూచించారు. టెంపుల్ కు ఇరువైపులా స్టాప్ గేట్స్ ఏర్పాటు చేయాలని టెంపుల్ ఈఓకు సూచించారు. వచ్చే భక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటుచేసి మందులు అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ కు సూచించారు.
సౌండ్ సిస్టం ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఐ& పి డిపార్ట్మెంట్ కు సూచించారు. వచ్చే ఆర్టీసీ బస్సులను బస్టాండ్ లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. వచ్చే భక్తుల గురించి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు . వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఈ నెల 25 తారీకు లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ..స్వామి వారి కల్యాణోత్సవం, జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆలయ ఈవో బాలాజీ, ఆలయ సిబ్బంది, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున, ఆలయ ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, వల్లద్రి అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్, ఏ సీ పీ సతీష్, సీఐ శ్రీను, ఎస్ ఐ రాజు గౌడ్,విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్,ఎక్స్భైజ్, ఆర్ టీ సీ, డీపీఆర్ఓ, పీఆర్ ఇఇ,ఐ& పీఆర్ ఆర్&బి,ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.