తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: పంజాబ్ ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్రం భారత దేశానికే ఆదర్శమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్... Punjab CM Visits Erravelli, Narsannapeta Villages

Update: 2023-02-16 11:46 GMT

దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్రం భారత దేశానికే ఆదర్శమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన, పథకాల నిర్వహణ మరియు తాగునీరు, సాగునీరు మొదలైన అంశాలు విశ్లేషణ చేయడానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి, వారి బృందం మర్కుక్ మండలం పాములపర్తిలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్, ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి స్థానిక నాయకులతో తమ ఆలోచనలను పంచుకున్నారు.


ఈ సందర్భంగా మర్కుక్ మండలానికి విచ్చేసిన ముఖ్యమంత్రి, బృందానికి మర్కుక్ మండల ఎంపీపీ పాండు, గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, నాచారం గుట్ట చైర్మన్ హరిపంతులు, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, స్థానిక మండల బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికి మర్కుక్ మండల ప్రాంతం కొండపోచమ్మ డ్యామ్ పైకి తీసుకెళ్లి వివరించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి, నర్సన్నపేటలలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానిక సర్పంచ్ లు భాగ్య బిక్షపతి, మాధవి రాజిరెడ్డి, ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు, నాయకులు గీసు మల్లేశంలతో కలిసి ఊరంతా తిరిగి బతుకుమ్మ చెరువును చూసి సర్పంచ్ భాగ్య బిక్షపతికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు శ్రీశైలం తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News