సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా వాణిలో నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే సత్వరమే పరిష్కరిస్తామని మెదక్ అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు.

Update: 2024-03-18 13:18 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా వాణిలో నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే సత్వరమే పరిష్కరిస్తామని మెదక్ అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు రమేష్ మాట్లాడుతూ… ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలి కానీ ఇతరుల మీద ఆధార పడరాదని సూచించారు. ధరణి భూ సమస్యల గురించి 33,పెన్షన్ కోసం 4, ఉఫాది, త్రీ ఇతర సమస్యల గురించి 33 మంది నుంచి ఆర్జీలు స్వీకరించమని, తెలిపారు. వివిధ సమస్యల పై ప్రజలు పెట్టుకున్న అర్జీలను వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌వో పద్మశ్రీ , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Similar News