ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణికి వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-11 10:32 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… మెదక్ అలాగే హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటిదాకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, వాటికి సరైన కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన వారు మళ్లీ పదే పదే రాకూడదని అర్హతను బట్టి వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో సమస్య పూర్వపరాలను వివరించాలన్నారు. అప్పుడే ప్రజావాణి పై ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 100 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 35 డీఆర్‌డీఓ -11 ఇతర శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ, పీడీ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, మైన్స్ జయరాజ్, ఏడీ అగ్రికల్చర్ గోవింద్, జీఎం ఇండస్ట్రీస్ కృష్ణమూర్తి ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాస్, యువజన క్రీడల అధికారి నాగరాజు, సివిల్ సప్లై అధికారి బ్రహ్మారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News