Vikarabad Collector :ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లాలో పనిచేసే ప్రతి జిల్లా అధికారి క్షేత్రస్థాయిలో
దిశ,ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో పనిచేసే ప్రతి జిల్లా అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, మీ పరిధిలో ఉండే మండలాల్లో పర్యటించి ఏఏ పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సిన పనులు ఏవి పెండింగ్ ఉన్నవో తెలుసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు 178 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 178 అర్జీలు రాగా, భూ సర్వే,పెన్షన్, ఇతర భూ సమస్యలకు సంబంధించినవి, ఇతర శాఖలకు సంబంధించినవి దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వెంట వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఇంఛార్జి కలెక్టర్ సుధీర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.