వైవిద్దీకరణలో భాగంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించండి: తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణాన్ని

Update: 2024-10-19 15:20 GMT

దిశ,ములుగు : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించడంతోపాటు, వైవిద్దీకరణలో భాగంగా ఉద్యాన పంటలను భారీగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శనివారం శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా పదవి బాధ్యతలు తీసుకున్న డాక్టర్ దండ రాజిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఒకే సాగు భూమిలో బహుళ పంటల సాగుతో రైతుల ఆదాయాలు పెంచే ఉత్తమమైన మార్గమని, దీనికి విశ్వవిద్యాలయం వెన్నుదన్నుగా ఉండి రైతుల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్య పంటలను మల్టీ స్టోరిడ్ పద్ధతిలో సాగు చేసుకునేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ప్రత్యేకించి వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్, ఇతర తోట పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. పెట్టిన పెట్టుబడి తక్కువ కాలంలోనే రైతులకు తిరిగి రావాలంటే ఉద్యాన పంటలు మార్గమని మంత్రి అన్నారు.


Similar News