రహదారి నిర్మాణంలో ప్రమాదకరంగా గుంతలు.. డబ్బులు ఇస్తేనే గుంతలు పూడ్చివేత

సిద్దిపేట ఎల్కతుర్తి రోడ్డు నిర్మాణంలో భాగంగా గ్రామ సరిహద్దుల్లోని

Update: 2024-07-06 09:54 GMT

దిశ,నంగునూరు : సిద్దిపేట ఎల్కతుర్తి రోడ్డు నిర్మాణంలో భాగంగా గ్రామ సరిహద్దుల్లోని ఇండ్ల ముందు రోడ్డు పక్కన  గుంతలు తీశారు. అవి పూడ్చేందుకు డబ్బులిస్తేనే మట్టి పోస్తూ, ఇవ్వని వారి పట్ల వివక్ష చూపుతున్నారని పాలమాకుల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఆరు నెలల కిందట గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఇరువైపుల మురుగు కాల్వల నిర్మాణం పనులు చేపట్టారు.

పనులు పూర్తై 2 నెలలు గడుస్తున్నా మురుగుకాలువ పక్కన లోతుగా తీసిన గుంతలు పూడ్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి సిమెంట్ కలిపిన కాంక్రీట్, మట్టి పోస్తూ గుంతలను పూడుస్తున్నారని, తాము డబ్బులు ఇవ్వకపోవడంతో పొంతన లేని సమాదాలు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారుల స్పందించి గుంతలను మట్టితో పూడ్చి వేయాలని కోరుతున్నారు.


Similar News