ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీలో అధికారుల నిర్లక్ష్యం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ప్రజా పాలనలో సేకరించిన దరఖాస్తులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా సరిగా డేటా ఎంట్రీ చేయకపోవడంతో సామాన్య ప్రజల మైన మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

Update: 2024-03-11 12:05 GMT

దిశ, నంగునూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ప్రజా పాలనలో సేకరించిన దరఖాస్తులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా సరిగా డేటా ఎంట్రీ చేయకపోవడంతో సామాన్య ప్రజల మైన మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. దీనిపై ప్రభుత్వం పథకాలు అమలు కానీ లబ్ధిదారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పాడంతో సోమవారం నంగునూరు ఎంపీడీవో కార్యాలయం ముందు వందల మంది క్యూలో నిల్చుని ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో కొందరికి పథకాలు అమలు కావడంతో పథకాలు రానీ నిరుపేదలు అయోమయానికి గురై ఎంపీడీవో ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరెంటు బిల్లు పక్కింటి వారికి జీరో బిల్లు వచ్చినప్పటికీ తమకు ఎందుకు రాలేదని ఆవేదన గురవుతున్నారు. గ్యాస్ బిల్లు సైతం గ్రామాల్లో కొంతమందికి వచ్చాయని మాకెందుకు రాదని మేము నిరుపేదలమేనని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేదలైన లబ్ధిదారుల డేటా ఎంట్రీని సరిగా చేసి ప్రభుత్వ పథకాలు అమలు అయ్యేలా చూడాలని ఆయా గ్రామాల నిరుపేదలు కోరుతున్నారు. ఆరు గ్యారంటీలు అందరికి అమలయ్యేలా చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో హామీ ఇచ్చి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని లబ్ధిదారుల ఎంట్రీలో అలసత్వం ఎందుకని నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామానికి చెందిన పరమాండ్ల మల్లేశం ఆరోపించాడు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి లబ్ధిదారుల ఎంట్రీని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆఫీస్ చుట్టూ నిరుపేదలను తిప్పుకోవడం సమంజసం కాదని ఆరోపించారు.


Similar News