కళాశాల విద్యార్థుల అభివృద్ధి తోడ్పాటు అందిస్తాము : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పట్టణంలోని సిద్దాపూర్ లో గల

Update: 2024-10-23 12:19 GMT

దిశ,సదాశివపేట: స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పట్టణంలోని సిద్దాపూర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం సందర్శించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్ కళాశాల అవసరాలకు సంబంధించి వినతి పత్రం ఎమ్మెల్యే కు సమర్పించారు. ఉమెన్స్ హాస్టల్ సదుపాయం, ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ గ్రిల్ ఏర్పాటు, కళాశాల భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం, తాగునీటి సదుపాయం, బాలికలకు రెస్ట్ రూమ్ సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే ను కోరారు. ఎ మ్యేల్యే స్పందించి సహృదయంతో పై వాటిని సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెమినార్ హాల్లో విద్యార్థులతో మాట్లాడుతూ ...కళాశాలలో వసతుల కల్పనకు తన సహకారం ఉంటుందని , విద్యార్థులు చదువులో రాణిస్తూ జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అపర్ణ శివరాజ్ పాటిల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేట అల్యూమిని అసోసియేట్ ప్రెసిడెంట్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ ,ప్రధాన కార్యదర్శి డాకూరు అశోక్ గౌడ్, కోశాధికారి జంగం మహేష్, కౌన్సిలర్స్ ఇంద్ర మోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, శ్రీనివాస్ , కో ఆప్షన్ సభ్యుడు కోడూరు అంజయ్య,కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిద్ధులు, ఉపాధ్యాలు శకుంతల, మురళీకృష్ణ, సరవయ్య నాన్ టీచింగ్ స్టాఫ్, బిఆర్ఎస్ నాయకులు ముబీన్, సాతాని శ్రీశైలం, నసీరుద్దీన్, నాగుల విజయ్ కుమార్, బరాడి శివ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News