ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు అందిస్తాం : నారాయణఖేడ్ ఎమ్మెల్యే
కల్హేర్ మండల పరిధిలోని రాపర్తి,క్రిష్ణాపూర్, బూచేపల్లి గ్రామాల్లో
దిశ,కల్హేర్ : కల్హేర్ మండల పరిధిలోని రాపర్తి,క్రిష్ణాపూర్, బూచేపల్లి గ్రామాల్లో గురువారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు అందిస్తామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.ఏ గ్రేడ్ ధాన్యం రూ.2320 బి గ్రేడ్ ధాన్యం రూ. 2300,సన్నవడ్లకురూ. 500 బొనస్ తో 2820 క్వింటాలకు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శివ శ్రీనివాస్, ఎంపీ ఓ శ్రీనివాస్,ఐకేపీ ఏపీఎం సాయిలు,సిసి పోచయ్య,కల్హేర్ మండల కాంగ్రెస్ నాయకులు మాన్దొడ్డి తుకారాం,వీర్ శెట్టి, గైని దేవదాస్,సాయిలు,మాజీ ఉప సర్పంచ్ ఈశ్వర్,పండరి,విఠల్,ఖయ్యూం,హన్మంత్ రెడ్డి,మహేందర్,రవీందర్,ప్రసాద్ మచ్చేందర్,కరుణాకర్,ఐకేపీ వీవోఏ నాగరాజు,వివో ఏ సభ్యులు,మరియమ్మ,సాలవ్వ రైతులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.