మంజీరా నీటి సప్లై పై ఎమ్మెల్యే సమీక్ష

సంగారెడ్డిలో మున్సిపల్ అధికారులతో మంజీరా నీటి సప్లై పై సమీక్ష సమావేశం, సంగారెడ్డిలో డ్యామేజ్ అయిన ఇండ్లకు గృహలక్ష్మి పధకం కింద 3 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు సూచించారు.

Update: 2023-10-03 16:15 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డిలో మున్సిపల్ అధికారులతో మంజీరా నీటి సప్లై పై సమీక్ష సమావేశం, సంగారెడ్డిలో డ్యామేజ్ అయిన ఇండ్లకు గృహలక్ష్మి పధకం కింద 3 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో అధికారులతో మంజీరా నీటి సప్లై పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమీషనర్, పబ్లిక్ హెల్త్ ఏఈ, మున్సిపల్ డీఈ, ఇరిగేషన్ డీఈ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత 2.0 ఫండ్స్ నుండి సంగారెడ్డి టౌన్ లో నీటి కోసం 44 కోట్లు విడుదల చేసిన నిధుల ఎలా ఉపయోగించాలనే దాని పై చర్చించారు. నాల్సాబ్ గడ్డ బొబ్బిలికుంట చెరువు డిస్మెంటల్ చేసిన్నపుడు ఆ చెరువుకు ఆనుకోని ఉన్న 55 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయన్నారు. ఈ డ్యామేజ్ అయిన ఇండ్లకు గృహలక్ష్మి పధకం కింద 3 లక్షలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సంగారెడ్డి టౌన్ లో త్రాగు నీరు మంచిగా శుభ్రం చేసి సప్లై చేయాలన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు ఫిల్టర్ బెడ్ లు రిపేర్ కి రాకుండా చెక్ చూసుకునే వాడిని అని తెలిపారు.

ఫిల్టర్ బెడ్ లు సరిగా మైంటైన్ చేసి ఉంటే నీటి సమస్య వచ్చేదే కాదని అన్నారు. ఉన్న 3 ఫిల్టర్ బెడ్ లు అని మంచిగా చేయాలని, పైప్ లైన్స్ కూడా వేయాలని చెప్పారు. ఎంతో దూరదృష్టితో కట్టించిన ఫిల్టర్ బెడ్ ల ఉపయోగం సరిగా జరుగడం లేదనిపిస్తుందన్నారు. అమృత 2.O నిధులు ఫిల్టర్ బెడ్ పైప్ లైన్స్ కోసం ఉపయోగించాలని సూచించారు. అలాగే సంగారెడ్డి చౌరస్తా, తాళ్లపల్లి, కొత్లాపూర్ రోడ్స్ లెఫ్ట్, రైట్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగించాలని అన్నారు. నల్సబ్ గడ్డ రిక్షా నగర్, నూరి మస్జీద్, కల్వకుంట్ల, న్యూబస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడ నీళ్లు వస్తున్నాయి కదా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల వెళ్ళే మార్గం లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రోడ్స్ కి కొత్త కాలనీలు వచ్చాయని, అవి ప్రియారిటీలో పెట్టుకోవాలని అధికారులకు చెప్పారు. ఆదర్శ నగర్ కాలనీ చుట్టూ పక్కల ఏరియా అంత కూడ త్రాగు నీరు సప్లై పూర్తిగా చేయాలన్నారు. అలాగే రాజంపేట ఏరియా, వడ్డెర కాలనీ, ఇందిరా కాలనీ, రాంచందర్ నగర్ కాలనీ లో నీటి సప్లై ఇబ్బంది లేదు కదా అని అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ చౌరస్తా ఇవతల ఎంఆర్ఎఫ్ కాలనీకి నీటి సరఫరా పై అడిగి తెలుసుకున్నారు. చవాన్ ఫంక్షన్ హాల్ వెనుక సైడ్ కొత్తగా ఏర్పడిన కాలనీ లకు పైప్ లైన్ లు వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు చౌరస్తా కూడ మున్సిపాలిటీ లో కలిసిందన్నారు.

అలాగే ఇరిగేషన్ కాలనీ, నారాయణరెడ్డి కాలనీ, కింది బజార్, శ్రీనగర్ కాలనీ, బండ్లగూడ, మేతరోలా బస్తీ, గొల్ల బస్తీ, మంగలి బస్తీ, కాటికోలా బస్తీ, ఉప్పర్ బజార్ కి ఏమైనా నీటి సమస్య అంత సప్లై ఉందా అని అడిగి తెలుసుకున్నారు. బృందావనం కాలనీ, ప్రగతి నగర్ కాలనీ, మధుర కాలనీలో కూడా నీటి సప్లై, పైప్ లైన్ పూర్తిగా వచ్చేలా చూసుకోవాలని అధికారులకు చెప్పారు. తాను ఎమ్మెల్యే గా గెలిచి నాలుగేళ్ళు అవుతుందని, అయినా కౌన్సిల్ ఉంది ఎవరి పనులు వారు చేస్తున్నారని తాను ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్ కి రాలేదన్నారు. అయినా ఈ నాలుగేళ్ళలో మనం ఒక 4 సార్లు కలిసి సంగారెడ్డి టౌన్ త్రాగు నీటి సప్లై విషయంలో డిస్కస్ చేశామని గుర్తు చేశారు. తాను ఉన్నపుడు మంజీరా ఇంటెక్ వెల్ నుండి ఫిల్టర్ బెడ్ కి వాటర్ తెచ్చి పురిఫై చేసి సప్లై చేసేవాళ్ళమన్నారు. తర్వాత భగీరథ వచ్చిందన్నారు. అధికారులను తప్పుపట్టను. ఎందుకంటే ఎస్టిమేషన్ వేస్తారు అవి పై ఆఫీస్ వరకు వెళ్ళి రావాల్సి ఉంటుందని, మన కైలాస పర్వతం ఆటలాగ ఉంటుందని అన్నారు.

2004 లో ఎమ్మెల్యే గా ఉన్నపుడు సీఈగా చంద్రశేఖర్ ఉండే అని, సంగారెడ్డి మున్సిపాలిటీ కి డ్రింకింగ్ వాటర్ కోసం డిస్కషన్ పెట్టిన అని గుర్తు చేశారు. అప్పుడు వాళ్ళు టౌన్ కి మొత్తం కలిపి నాలుగు ట్యాంక్ ల డిజైన్ ఇచ్చారని, అధికారులు మొత్తం 10 కోట్లతో ఎస్టిమేషన్ ఇచ్చారని, అందరిని కూర్చోబెట్టి 12 ట్యాంక్ లు పెట్టించానని చెప్పారు. రూ.120 కోట్ల ఎస్టిమేషన్ ఇచ్చి మంజూరు చేయించి పనులు చేపించానని అన్నారు. ఏ ట్యాంక్ కు ఎక్కడ పెట్టాలో కూడ తానే చెప్పి దగ్గరుండి పెట్టించానన్నారు. 2004 నుండి ఇంకో 40 ఏళ్లు దృష్టిలో పెట్టుకొని నీటి ఇబ్బంది రావొద్దని అలా నా మైండ్ తో ప్లాన్ చేశానన్నారు. అలాగే టౌన్ లో అనేక కొత్త కాలనీలు వచ్చాయని, అక్కడ మంచి నీటి సర్ఫరా చేయాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనాభా అంచనా వేసి నీటి సరఫరా పనులు చేయాలని అన్నారు. మంజీరా ఇంటెక్ వెల్ నుండి రాజంపేట ఫిల్టర్ బెడ్ కి నీరు డ్రా చేసి ఫిల్టర్ చేయాలని, అలా చేస్తే టౌన్ లో శుభ్రమైన త్రాగు నీరు ఇవ్వొచ్చన్నారు. కొత్తగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అ అపార్ట్మెంట్ లకు కూడ మంజీరా త్రాగు నీరు ఇచ్చే విధంగా చూడాలని తెలిపారు. అలాగే నాల్సాబ్ గడ్డ బొబ్బిలికుంట చెరువు డిస్మాండిల్ సమయంలో నష్టపోయినా ఇండ్ల వారికి గృహలక్ష్మి పధకం కింద 3 లక్షలు ఇవ్వాలని, అలాగే ఎక్కువ మొత్తం లో నష్టపోయిన ఇండ్లకు గృహలక్ష్మి స్కీమ్ కింద 6లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News