వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పీహెచ్సీ ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Update: 2024-10-19 12:10 GMT

దిశ,అల్లాదుర్గం : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పీహెచ్సీ ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని ఆరా తీశారు.హాస్పిటల్ కి వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News