Medak Collector : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాజిక ఆధునిక

Update: 2024-09-10 10:44 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. మంగళవారం చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతిని, జయంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేపట్టి నైజాం సర్కార్‌తో పాటు విస్నూర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.

ఆనాడు నిరంకుశ రజాకార్లను దేష్ముఖ్ లకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యం పోరాడిన న వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ వీరవనిత ధైర్య శాలిగా పేరు గాంచిందన్నారు.భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టిచాకిరీ విముక్తి కొరకు జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News