కాళేశ్వరం ప్రాజెక్టుతో మండలం సస్యశ్యామలం
రాష్ట్రంలో అక్కడక్కడ నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న చిన్నకోడూరు మండలంలో సస్యశ్యామలంగా ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
దిశ, చిన్న కోడూరు: రాష్ట్రంలో అక్కడక్కడ నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న చిన్నకోడూరు మండలంలో సస్యశ్యామలంగా ఉన్నాయని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… రూ. 20 లక్షలతో ఈ భవనం ప్రారంభించామన్నారు. ఎల్లమ్మ దయతో ఈ ఆలయంలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే మండలంలో ఎండాకాలంలో కూడా చెరువులో నీరు ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.
గతంలో 30 ఏండ్ల వరకు కూడా ప్రాజెక్ట్‌లు పూర్తి కాలేదని, కేసీఆర్ హయాంలో 4 ఏండ్లలో ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామన్నారు. కేసీఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశాం అన్నారు. వైన్స్ టెండర్లులో గీత కార్మికులకు రిజర్వేషన్లు తెచ్చాం. అనంతరం పెద్ద కోడూరు గ్రామంలో చంద్లాపూర్ పెద్దకోడూర్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు కేసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్, ఎంపీటీసీ పానుగంటి శారద, కర్రె మల్లు సాయి అన్న, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు గౌడ సంఘం సభ్యులు, పాల్గొన్నారు.