గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్…

అక్రమంగా ఎండు గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పక్కా సమాచారం మేరకు పట్టుకుని విచారించగా అతని వద్ద 20 వేల విలువగల గంజాయి లభించినట్లు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Update: 2024-10-03 15:04 GMT

దిశ, నర్సాపూర్: అక్రమంగా ఎండు గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పక్కా సమాచారం మేరకు పట్టుకుని విచారించగా అతని వద్ద 20 వేల విలువగల గంజాయి లభించినట్లు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి డి .పి .ఈ .ఒ - మెదక్ జిల్లా ఆదేశాల మేరకు మెదక్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, సిబ్బంది బుధవారం తూప్రాన్ పట్టణంలో అక్రమ గంజాయి విక్రయాలు జరిపే వ్యక్తుల పైన నిఘా ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ పట్టణంలోని శివాజీ నగర్ లో గల 6-76 ఇంట్లో నివాసం ఉంటున్న సంగ నర్సింలు అనే వ్యక్తి అక్రమంగా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేయగా అతని వద్ద 260 గ్రాములు కలిగిన 40 ప్యాకెట్స్ లభించినట్లు తెలిపారు. అధికారులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా 500 రూపాయలకు ఒక ప్యాకెట్ ని విక్రయిస్తున్నాడని చెప్పారు. దీని విలువ సుమారు 20000 వేల వరకు ఉన్నట్లు తెలిపారు. దాడులలో ఎక్సైజ్ అధికారులు నరేందర్, బాలయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, రాజు ,హరీష్, నరేష్, నవీన్, రవి, తదితరులు ఉన్నారు.


Similar News