Minister Ponnam : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా వరుద సాయం అందించని బిజెపికి

Update: 2024-10-03 11:37 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి :  కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా వరుద సాయం అందించని బిజెపికి, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అడుగడుగున అడ్డుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తక్కువ మొత్తంలో వరద సాయం అందిస్తే.. ప్రతిపక్ష పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు అన్నారు.

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలది ఢిల్లీలో దోస్తాని గల్లీలో కుస్తీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించి బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి.. ఫామ్ హౌస్ కే పరిమితమై నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో లేడని ఎద్దేవా చేశారు. రైతులకు లాభం చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యం దళారుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తెలిపారు.

అంతకుముందు గజ్వేల్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మెట్టు సాయికుమార్, ఎమ్మెల్సీ కూర రగోతం రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నాయకులు ఎలక్షన్ రెడ్డి, భూమ్ రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, గాడి పల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.


Similar News