ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి మెదక్ జిల్లా పర్యటనకు వస్తున్న

Update: 2024-12-21 11:14 GMT

దిశ, చేగుంట : ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి మెదక్ జిల్లా పర్యటనకు వస్తున్న రేవంత్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వెళ్తూ శనివారం చేగుంట మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి కొద్దిసేపు ఆగారు. మెదక్ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావును,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లను చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకుడు వెంగళరావు, నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి కనకయ్య, మహిళా నాయకురాలు కురుమ లక్ష్మీ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News