పెండింగ్ కేసులు పరిష్కరించాలి : సీపీ అనురాధ

పెండింగ్ కేసులను అన్ని కోణాల్లో పరిశోధన చేసి పరిష్కరించాలని

Update: 2024-12-21 11:17 GMT

దిశ, సిద్దిపేట అర్బన్ : పెండింగ్ కేసులను అన్ని కోణాల్లో పరిశోధన చేసి పరిష్కరించాలని పోలీసు కమిషనర్ అనురాధ అధికారులకు సూచించారు. పోలీసు కమిషనరేట్ లో 2023,2024 పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...మిస్సింగ్ కేసులలో ఎలాంటి అలసత్వం వహించ వద్దు అన్నారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సీఈఐఆర్ టెక్నాలజీతో రికవరీ చేసి బాధితులకు అందించాలన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 100 కు కాల్ కు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించి అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్ ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, అభయ యాప్, సామాజిక రుగ్మతల గురించి కాలేజీలలో స్కూల్స్ లలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాలు జూదం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచి వేయాలన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, ఎస్సీ ఇన్ స్పెక్టర్ కిరణ్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, శ్రీనివాస్, లతీఫ్, సైదా, మహేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News