ఎస్సై వేధింపులు.. పోలీస్ స్టేషన్లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

మహిళా ఏఎస్సై పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అందుకు ఎస్సై వేధింపులే కారణమని మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

Update: 2024-10-10 07:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆడపిల్లలు, మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే వారి పాలిట కీచకులుగా మారుతున్నారు. సాధారణ మహిళలకు కాదు కదా.. పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా ఏఎస్సైనే వేధించాడు ఓ ఎస్సై. అతని వేధింపులు భరించలేక ఆమె జిల్లా ఎస్పీకి లెటర్ రాసి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెదక్ జిల్లా చిలిప్ చేడ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై యాదగిరి తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఏఎస్సై పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె సోదరుడు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగుచూసింది.

తమ స్టేషన్ ఎస్సై యాదగిరి తనకు రెండురోజులు కంటిన్యూగా డ్యూటీ వేసి.. ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఆబ్సెంట్ వేస్తున్నాడని, ఆయనకు లొంగకపోతే ఇలా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు లేఖలో పేర్కొంది. అందరినీ ఒకలా, తనను మరోలా చూస్తున్నాడని.. ప్రతి చిన్నదానికి ఆబ్సెంట్ వేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు ఎలాంటి అఘాయిత్యం జరిగినా.. అందుకు కారణం ఎస్సై యాదగిరినే అని, మహిళా పోలీసులను లొంగదీసుకోవాలని వేధించే అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని, కఠినంగా శిక్షించాలని కోరింది. 



 



Similar News