కలిసి పని చేద్దాం... ప్రజా సమస్యలు పరిష్కరిద్దాం
ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజా సమస్యల పరిష్కరిద్దామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
దిశ కొల్చారం: ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజా సమస్యల పరిష్కరిద్దామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవికాలం తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. సమస్య తీవ్రతను బట్టి పై స్థాయికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. దుంపలకుంట నుంచి సంగాయిపేట వరకు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చాలని సూచించారు. మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశం గ్రామాలలో జరుగుతున్న సమస్యలు చర్చించి పరిష్కరించే వేదికగా ఎమ్మెల్యే తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాలకు మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రోటోకాల్ పాటిస్తూ ఇంజనీరింగ్ అధికారులు చేపట్టాలని సూచించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మొట్టమొదటిసారిగా మండల సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని జెడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల సంతోష్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి నివేదికలను చదివి సభకు వినిపించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి మాట్లాడుతూ తాము గెలిచిన నాటి నుంచి ఏ ఒక్క రూపాయి పని చేయలేదని ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ ఎంపీడీవో లక్ష్మీ నరసింహులు, తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా, ఎంఈఓ నీలకంఠం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు ఉదయ వేమారెడ్డి, ఎంపీటీసీ ఎల్లయ్య, ఆయా శాఖల అధికారులు మైపాల్ రెడ్డి, సుసీల, హైమద్, ఇర్ఫాన్ హుస్సేన్, శ్వేత కుమారి, లక్ష్మీనర్సమ్మ, డాక్టర్ హర్షిత, శ్రీకాంత్, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.