తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది.. దరిపల్లి చంద్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందే తప్ప.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు.

Update: 2023-10-18 16:42 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందే తప్ప.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పేరిట బుధవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల ను సీఎం కేసీఆర్ కాపీ కొట్టారన్నారు.

బీఆర్ఎస్ తాజా మేనిఫెస్టోల ప్రస్తావించిన పథకాలను 9 ఏళ్లుగా ఎందుకు అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కలువని సీఎం కేసీఆర్ ఎన్నికలు రాగానే పథకాల పేరిట ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మరన్నారు. ఈ కార్యక్రమంలో మజార్ మల్లిక్, శ్రీనివాస్ రెడ్డి, మధు, గయాజుద్దీన్, రాకేష్, రఘుపతి, అనిల్, నవాజ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News