మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ఉమ్మడి మండల నాయకులు..
తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిశారు.
దిశ, తూప్రాన్ : తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి స్థానిక ఎన్నికల పై ఆయనతో మాట్లాడారు. ఉమ్మడి మండలంలో జరుగుతున్న పార్టీ విషయాల పై చర్చలు జరిపినట్టు వారు తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, మనోహరబాద్ బీఆర్ఎస్ నేత శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెండు మండల నాయకులు కలిశారు.
ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మనోహరాబాద్ మండల అధ్యక్షుడి ఎన్నిక చేయాలని కోరారు. సంక్రాంతి పండుగ తరువాత మండలానికి కొత్త అధ్యక్షున్ని ఎన్నిక హరీష్ ఆదేశాల మేరకు నిర్ణయిస్తారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ప్రతి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని హరీష్ రావు సూచించినట్టు వారు తెలిపారు. మనోహరాబాద్ మండల్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలాల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి నరేష్ ముదిరాజ్, కత్తుల వెంకటేష్, పంజా బిక్షపతి, నూకల వెంకటేష్ యాదవ్ రాహుల్ లక్ష్మణ్ యాదవ్ అరుణ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.