ఇంటికి గొళ్ళెం పెట్టి…సుతిల్ బాంబులతో ఇంటి పై దాడి

ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దీపావళి సుతిల్ బాంబ్ లతో ఇంటిపై దాడి చేసిన ఘటన రామాయంపేట మండలం లక్ష్మాపూర్ లో సోమవారం అర్ధరాత్రి జరిగింది.

Update: 2025-01-07 12:19 GMT

దిశ, నిజాంపేట : ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దీపావళి సుతిల్ బాంబ్ లతో ఇంటిపై దాడి చేసిన ఘటన రామాయంపేట మండలం లక్ష్మాపూర్ లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో వారీగా శబ్దం వచ్చి ఇంటి పై మంటలు చెలరేగాయి. వెంటనే మేల్కొన్న కుటుంబీకులు ఇంట్లో ఉన్న నీటితో మంటలను ఆర్పారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా తలపులు తెరుచుకోకుండ బయట నుంచి దుండగులు గొల్లం పెట్టారు.

ఫోన్ చేసి చుట్టూ పక్కల వారికి తెలియజేయడంతో గ్రామస్తులు వచ్చి వారిని బయటకు తీసుకు వచ్చారు. దీపావళి కోసం వాడే సుతిల్ బాంబ్ లను కట్టి ఇంటి పై పడేసినట్టు స్థానికులు తెలిపారు. ఇంటిపై దాడి ఆకతాయిల పనా, లేక ఉద్దేశ్య పూర్వకంగా చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇంటి పై వేసిన టపాసుల వల్ల పై భాగాం కూలింది. ఇది కావాలనే చేసి ఉంటారన్న అనుమానం కూడా గ్రామంలో వ్యక్తం అవుతుంది. విషయం తీసుకున్న రామాయంపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామాల్లో మరికొన్ని ఇళ్లకు కూడా గొళ్ళెం పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News