మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కు పాదం మోపాలి : సంగారెడ్డి ఎస్పీ
మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కపాదం మోపాలని
దిశ, సంగారెడ్డి : మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కపాదం మోపాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుండి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, జిల్లాలో ఎలాంటివి అక్రమ రవాణా జరగకుండా, తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ, అనుమానిత వెహికిల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. మట్కా గ్యాంబ్లింగ్ నిర్వాసితులపై ప్రత్యేక నిఘా ఉంచి, ముందస్తుగా బైండోవర్ చేయాలని సూచించారు. నేరాలను అదుపు చేయడానికి, జరిగిన నేరాలను డిటెక్ట్ చేయడంలో సీసీ కామెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు.
ఎక్కువగా ఆత్మహత్యలకు పురుగుల మందునే వినియోగిస్తున్నారని, ఆత్మహత్యలు నివారించడానికి ఫర్టిలైజర్స్ షాప్ యజమానులతో మాట్లాడి, అనుమానిత వ్యక్తులకు ఫర్టిలైజర్స్ అమ్మకుండా, రైతులకు మాత్రమే అమ్మే విధంగా గైడ్ చేయాలని సూచించారు. యస్.హెచ్.ఓలు ప్రతి రోజు ఉదయం సిబ్బందితో రోల్ కాల్ నిర్వహించి, వారు చేయలసిన పని గురించి వివరిస్తూ ఎప్పటికప్పుడు వారికి సలహాలు సూచనలు చేయాలన్నారు. ప్రతి కేసులో యస్.హెచ్.ఓ నేరస్థలాన్ని సందర్శించి, నేరస్తుల ఫోటోగ్రఫీ తీయించాలని, వీలైనంత తొందరగా నేరస్థలానికి చేరుకొని నేరస్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నారు. నూతన చట్టాల ప్రకారం అవసరం ఉన్న కేసులలో ముందస్తుగా డీఎస్పీ నుండి అనుమతి పొంది ప్రథమ విచారణ చేసిన తరువాతనే కేసును నమోదు చేయాలని సూచించారు.