Medak Collector : మెదక్ వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి

Update: 2024-07-22 14:30 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీ కి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రవీంద్ర కుమార్ కోరారు. మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గౌరవ వేతన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్లు-25, అసోసియేట్ ప్రొఫెసర్లు-28, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-56 భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండి, ఎoఎస్, డిఎన్బి, పీజీ డిగ్రీలో సాధించిన మార్కులు ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ లో సాధించిన మార్కులు అర్హత పరీక్షలో 50 శాతం మార్కులు పరిగణనలోకి తీసుకుంటామని ఆర్ఓఆర్ ను అనుసరిస్తారని తెలిపారు. ట్యూటర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుదారుడి వయసు 31 మార్చి 2025 నాటికి 45 ఏళ్ల లోపు ఉండాలని, స్థానికేతర అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1,90,000 ఉంటుందని, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం- నెలకు-1,50,000 , అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకురూ. 1,25000 ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెదక్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆధీనంలో పని చేయడానికి 31 మార్చి 2025 వరకు గౌరవ వేతనం ప్రాతిపదికన ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు నియామకం చేస్తున్నట్లు చెప్పారు. స్థానికేతర అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. బయట రాష్ట్ర అభ్యర్థుల తమ నియామకాన్ని ధృవీకరించడానికి ఎంపికైన వారం రోజుల్లోగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి తమ అర్హతను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఒరిజినల్ అకడమిక్ సర్టిఫికెట్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండు సెట్లు అకడమిక్ సర్టిఫికెట్ల ఫోటో కాపీలతో ఈనెల 25వ తారీకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని పర్యవేక్షక ఛాంబర్ లో ఇంటర్వ్యూలు హాజరు కావాలని చెప్పారు.

Tags:    

Similar News