రెండుసార్లు మోసపోయాం మళ్లీ మోసపోవద్దు

రెండుసార్లు మోసపోయాం మళ్లీ మోసపోవద్దని, ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ అన్నారు.

Update: 2023-11-13 15:04 GMT

దిశ, చిన్నశంకరంపేట: రెండుసార్లు మోసపోయాం మళ్లీ మోసపోవద్దని, ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మండలంలోని చిన్నశంకరంపేట మండలంలోని కోయ్యమర్రి తండా, నాగులమ్మ తండా, ఎర్రగుంట తండా, సర్వన్ తండా, సోముల తండా, జంగరాయి, చందాపూర్, మల్లుపల్లి, రుద్రారం, చందంపేట, అంబాజీపేట, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు సార్లు మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మదేవేందర్ రెడ్డి, ఆస్తులు సంపాదించుకోవడమే తప్ప అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సంపాదన దోచుకుంటూ అధికారం వెలగబెడుతున్న బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దని ఇప్పటికే రెండుసార్లు మోసపోయామని మళ్లీ మోస పోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని విమర్శించారు. మోసం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని మళ్ళీ మోసపోయి గోస పడవద్దని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రచార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాల్ రెడ్డి, మండల ప్రచార కమిటీ అధ్యక్షులు బందెల సాయిలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీమన్ రెడ్డి, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ , పడాల సిద్ధిరాములు, మైనంపల్లి రంగారావు, మేడి గణేష్, యాదవరావు, మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మి శంకరయ్య , రమేష్ గౌడ్,సాన సత్యనారాయణతో పాటు నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News