హత్నుర ప్రభుత్వ ఆర్ ఐటీఐలో ప్రవేశాలకు అవకాశం

సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ ఐ.టి.ఐ.లో ప్రవేశాల కోసం ఈ నెల 30 అక్టోబర్ 2024 వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-10-22 15:31 GMT

దిశ, హత్నూర : సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ ఐ.టి.ఐ.లో ప్రవేశాల కోసం ఈ నెల 30 అక్టోబర్ 2024 వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 172 సీట్లకు గాను 113 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదీ దరఖాస్తులకు చివరి గడువైనందున ఆసక్తి ఉన్న విద్యార్థులు తక్షణం తమ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హత్నూర ఆర్ ఐ టి ఐ లో ప్రాధాన్యత కలిగిన కోర్సులు ఈ టెక్నాలజీ ఆధారంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

హత్నూర ఐ.టి.ఐలో విద్యార్థులకు వివిధ ఆధునిక (ఏటీసీ ) కోర్సులు అందించబడుతున్నాయన్నారు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ (ఒక సంవత్సరం), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్స్ (ఒక సంవత్సరం), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ (ఒక సంవత్సరం), బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్-మెకానికల్ (రెండు సంవత్సరాలు), అడ్వాన్స్డ్ సి.ఎన్.సి. మషీనింగ్ టెక్నీషియన్ (రెండు సంవత్సరాలు),మెకానిక్ ఎలెక్ట్రిక్ వెహికల్ (రెండు సంవత్సరాలు), ఈ కోర్సులు విద్యార్థులకు ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందిన విద్యార్థులకు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. పదవ తరగతి (10th class) ఉత్తీర్ణత తో ఈ కోర్సులకు అర్హతగా పరిగణించబడుతుందన్నారు. విద్యార్థులు తమ ఎస్.ఎస్.సి. మెమో, టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్), కుల ధ్రువీకరణ పత్రం, బోనాఫైడ్,ఆధార్ కార్డు వంటి పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. అడ్మిషన్ సంబంధిత వివరాలు, ప్రొసెసింగ్ కోసం హత్నుర ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపాల్‌ ను ఫోన్ నెంబర్ 9963004960 లో సంప్రదించవచ్చని తెలిపారు.


Similar News