భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న హల్ది వాగు.. ఆ డ్యాం వద్ద ప్రమాద సూచిక ఏర్పాటు

ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హల్దీ వాగు పొంగిపొర్లుతుండడంతో తూప్రాన్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో భారీగా నీరు చేరింది.

Update: 2024-09-01 07:20 GMT

దిశ, తూప్రాన్: ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హల్దీ వాగు పొంగిపొర్లుతుండడంతో తూప్రాన్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో భారీగా నీరు చేరింది. కిష్టాపూర్ డ్యామ్ వద్ద రోడ్డుపై భారీగా వరదనీరు వెళుతుండడంతో వాహనదారులు అటువైపు వెళ్ళొద్దని మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని తెలిపారు. శిథిలా వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ఉండొద్దని సూచించారు. మండల కార్యాలయంలో హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేసి నంబరు ఇచ్చామని ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే సంప్రదించగలరని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా నిండుకుండలా పొంగుతున్న హాల్దివాగు కిష్టాపూర్ డ్యామ్ చూడడానికి స్థానిక నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.


Similar News