ప్రభుత్వ ఆసుపత్రికి తాళం... వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి

ఓ నిండు గర్భిణీ అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది.

Update: 2024-03-11 14:19 GMT

దిశ, వెల్దుర్తి: ఓ నిండు గర్భిణీ అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. అక్కడ ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవం అయిన సంఘటన వెల్దుర్తి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజన పురిటి నొప్పులతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆసుపత్రికి రాగ డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది లేక తాళం వేసి ఉండడంతో ప్రసవ వేదనతో బాధపడుతున్న సృజనను చూసి కుటుంబీకులు గత కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో పని చేసిన నరసమ్మ వద్దకు వెళ్లగా ఆమె వెంటనే స్పందించి ఆసుపత్రి బయటే ప్రసవం చేసింది. అయితే సోమవారం కూాడా మూడు గంటల వరకు డాక్టర్ రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ విషయమే జిల్లా వైద్యాధికారి వివరణ కోరగా రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న సిస్టర్‌కు మెమో ఇచ్చామని అలాగే డాక్టర్ పైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


Similar News