వెళ్లిరా మాయమ్మ.. మళ్ళీ రావమ్మా...

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని దుర్గా మాత రోజు ఒక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకొని ఆదివారం నిమజ్జనానికి తరలాయి.

Update: 2024-10-13 16:00 GMT

దిశ, మిరుదొడ్డి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని దుర్గా మాత రోజు ఒక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకొని ఆదివారం నిమజ్జనానికి తరలాయి. మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో అలాగే స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత శోభాయాత్రలో చిన్న పిల్లల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. డీజే సౌండ్, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. ఒగ్గు కళాకారుల బృందం, డోలు చప్పుల్ల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు.


Similar News