అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగర్వాల్
సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గా (స్థానిక సంస్థలు) గరీమా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గా (స్థానిక సంస్థలు) గరీమా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన ముజామిల్ ఖాన్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ కావడంతో కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) విధులు నిర్వహిస్తున్న గరీమా అగర్వాల్ సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన గరీమా అగర్వాల్ యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్ గా రెండేళ్లు, కరీంనరగ్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గా రెండేళ్లు విధులు నిర్వర్తించారు.
దళిత బంధు, పోషక అభియాన్ కార్యక్రమం అమలు నేషనల్ పంచాయతీ అవార్డు రావడానికి కృషి చేసి అందరి మన్ననలు పొందారు. అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. అదే విధంగా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ను పోలీస్ కమిషనర్ శ్వేత మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు నూతన అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగర్వాల్ కు శుభాకంక్షలు తెలిపారు.