వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదు : కలెక్టర్
వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదని, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే దివ్యాంగులూ అద్భుత విజయాలను సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు.
దిశ, సంగారెడ్డి : వైకల్యం శరీరానికి మాత్రమే మనసుకు కాదని, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే దివ్యాంగులూ అద్భుత విజయాలను సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జాతీయ దివ్యాంగుల క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… దివ్యాంగులు తమ అంగవైకల్యం చూసి కుంగిపోవద్దన్నారు. ఆత్మ విశ్వాసం పట్టుదల ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చన్నారు. వైకల్యం శరీరానికి మాత్రమే అని మనసుకు కాదని, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే దివ్యాంగులూ అద్భుత విజయాలను సాధించగలరన్నారు.
జీవితంలో చదువు అత్యంత కీలకమైనదని, చదువుతోనే మనం మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చునని పేర్కొన్నారు. ఐఏఎస్ శిక్షణ సమయంలో తన బ్యాచ్‌మేట్ అజయ్ అరోరా గురించి ఆమె ప్రస్తావిస్తూ, ఆయన పూర్తిగా అంధుడు, తను పట్టుదలతో ఐఏఎస్ సాధించి, ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్‌లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, యువజన సంక్షేమ శాఖ అధికారి కాసీం బేగ్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు సాయికుమార్, రవి, జుబేదా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.