Siddipet: సిద్ధిపేటలో దారుణాలు.. బాలిక, మహిళపై అత్యాచారాలు

సిద్ధిపేటలో వరుస దారుణాలు జరిగాయి. హుస్నాబాద్ లో బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా.. జగదేవ్ పూర్ లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

Update: 2024-10-29 07:24 GMT

దిశ, వెబ్ డెస్క్/హుస్నాబాద్: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఇప్పటికే మహిళలపై నేరాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించినా.. మృగాళ్ల ఆలోచనల్లో మాత్రం మార్పు లేదు. నెలల పిల్లల నుంచి పండుముసలి వరకూ అందరిపైనా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా (Siddipet)లో వరుస దారుణాలు జరిగాయి. హుస్నాబాద్ లో ఇంటి ముందు ఆడుకుంటోన్న గిరిజన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరగ్గా.. బాలిక నిన్న రాత్రి తన తల్లికి జరిగిన ఘటనను చెప్పగా.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ శ్రీను.. అత్యాచారానికి పాల్పడిన యువకులు బాలిక కుటుంబం నివాసం ఉంటోన్న కాలనీకి చెందినవారుగా గుర్తించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం చికిత్స పొందుతోందని తెలిపారు.

జగదేవ్ పూర్ లో మరో దారుణం

జిల్లాలోని జగదేవ్ పూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి తెగబడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్ కి మహిళ నడుస్తూ వెళ్తుండగా.. ఒక ఆటో వచ్చింది. త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆటో ఎక్కగా.. దొరికిందే ఛాన్స్ గా భావించాడు ఆ దుర్మార్గుడు. గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. డ్ర్రైవర్ నర్సింహులు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పీఎస్ కు చేరుకున్న మహిళ, అతనిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News