జిన్సెంగ్ లిక్విడ్ ఆయిల్ పేరుతో ఘరానా మోసం..

గుమ్మడిదల మండల పరిధిలో ఘరానా మోసం చోటుచేసుకుంది.

Update: 2023-04-27 10:06 GMT

దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మండల పరిధిలో ఘరానా మోసం చోటుచేసుకుంది. జిన్సెంగ్ ఆయిల్ సరఫరా చేస్తే రిటింపు ఆదాయం వస్తుందని యూకే మహిళ చెప్పిన మాటలు విని ఓ వ్యక్తి రూ.1.76కోట్లు పోగొట్టుకున్నాడు. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన బారెడ నరహరికి యూకేలో ఉండే జానీ విలియమ్స్ అనే మహిళ 2019లో ఆన్లైన్లో పరిచయమైందన్నారు. తనకు ఆయిల్ కంపెనీ ఉన్నదని, తమ కంపెనీ జిన్సెంగ్ లిక్విడ్ ఆయిల్ ను సరఫరా చేస్తే డబుల్ ఆదాయం వస్తుందని ఆమె నరహరిని నమ్మించిందన్నారు. అంతేకాకుండా జిన్సెంగ్ లిక్విడ్ ఆయిల్ ముంబైలోని సజనయాదవ్ అనే మహిళ వద్ద లభిస్తుందని ఆమె ఫోన్ నంబర్ కూడా ఇచ్చిందని తెలిపారు.

ఆ నంబర్ ద్వారా సంజనయా దవ్ను నరహరి సంప్రదించాడన్నారు. సంజనయాదవ్ జిన్సెంగ్ లిక్విడ్ ఆయిల్నుతమ వద్ద రూ.3వేలకు కొని యూకేకు రూ.6వేలకు అమ్ముకోవచ్చని చెప్పిందన్నారు. లాభం వస్తుందని ఆశపడిన నరహరి పలు దఫాలుగా రూ.1.76కోట్లు సంజనయాదవ్ బ్యాంకు ఖాతాలో వేసి, ఆయిల్ను కొన్నాడని తెలిపారు. ఆ తర్వాత యూకేలోని జానీ విలియన్స్ సంప్రదించగా ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన నరహరి.. జానీ విలియన్స్, సంజనయాదవ్తో పాటు జెర్రీ బ్రౌన్, వాల్టర్, మార్క్ లివింగ్, జాక్సన్ల పై గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News