రైతులకు మెడకు పట్టిన దరిద్రం ధరణి: Former Minister Geeta Reddy

ధరణి పోర్టల్‌తో రైతుల మెడకు దరిద్రం చుట్టుకుందని మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు.

Update: 2022-11-30 12:27 GMT

దిశ, జహీరాబాద్: ధరణి పోర్టల్‌తో రైతుల మెడకు దరిద్రం చుట్టుకుందని మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులు భూ హక్కులను కోల్పోయారని ఆరోపించారు. పోడు భూములు, అసైన్మెంట్ భూముల ఆచూకీ ధరణిలో దొరకడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరిని అడిగినా రైతులకు సరైన జవాబు లభించడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలో జవాబుదారీ తనమే కరువైందని ఆరోపించారు. రైతుల ఎదుర్కొంటున్న ధరణి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం రైతులు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ రమేష్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశంలో మండల, పట్టణ నాయకులు నరసింహారెడ్డి, కండెం నర్సింలు, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి బొల్లు కిషన్, ఇతర నాయకులు ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

READ MORE

'రైతులను నట్టేట ముంచుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం'

Tags:    

Similar News