చింతమడకలో ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్

సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోని 13వ పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Update: 2024-05-13 15:01 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోని 13వ పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 16వ పోలింగ్ బూత్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114 పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కుటుంబ

     సమేతంగా సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి దంపతులు చిన్నకోడూరు మండలం గొనెపల్లిలో ఓటు హక్కువినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి కొండపాకలో, బీజేపీ ఎంపీ అభ్యర్థి మధవనేని రఘునందన్ రావు అక్బర్ పేట భూపంల్లి మండలంలోని స్వగ్రామం బొప్పాపూర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


Similar News